అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది.
అనంతపురం: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. చిట్టెపల్లి గ్రామంలో గొర్రెల మందపై సోమవారం చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 15 గొర్రెలు మృతిచెందాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.