సీడీపీఓలో తాజా పోస్టింగ్‌లు రద్దు | latest postings called off in CDPO | Sakshi
Sakshi News home page

సీడీపీఓలో తాజా పోస్టింగ్‌లు రద్దు

May 11 2014 1:51 AM | Updated on Aug 31 2018 8:24 PM

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(సీడీపీఓ)లో ఇటీవల ఇచ్చిన 102 పోస్టింగ్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
 
 సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(సీడీపీఓ)లో ఇటీవల ఇచ్చిన 102 పోస్టింగ్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు నష్టంకలిగేలా చేపట్టిన నియామకాలను రద్దు చేయాలని ఓ నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని ధర్మాసనం ఈనెల 8న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్తగా నియమితులైన ఉద్యోగుల జాయినింగ్ రిపోర్టులను తీసుకోవద్దని కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులపై మహిళా శిశుసంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి. రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement