తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు | Landslides at Tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

Oct 13 2015 4:28 PM | Updated on Sep 3 2017 10:54 AM

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో 16వ కిలోమీటర్ వద్ద బండరాళ్లు పడగా, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వాటిని తొలగించారు.

తిరుమల : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే  మార్గంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో 16వ కిలోమీటర్ వద్ద బండరాళ్లు పడగా, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వాటిని తొలగించారు. రాళ్లు పడే సమయంలో వాహనాలేవీ ఆ ప్రదేశంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గత కొన్ని రోజులుగా వర్షాలకు ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement