పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేత | kura rajanna arrested in kurnool district police | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేత

May 5 2015 9:13 AM | Updated on Aug 20 2018 4:27 PM

పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేత - Sakshi

పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేత

సీపీఐ (ఎంఎల్) జనశక్తి నేత కూర రాజన్నను కర్నూలు పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.

కర్నూలు:  సీపీఐ (ఎంఎల్) జనశక్తి నేత కూర రాజన్నను కర్నూలు పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఉన్న మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. గతంలో కోయిలకుంట్లలో జరిగిన కాల్పుల ఘటనలో కూర రాజన్నపై కేసు నమోదు అయింది. నిజామాబాద్లో ఓ హత్య కేసులో కూర రాజన్న ముద్దాయిగా ఉన్నారు.

అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలపై కూర రాజన్నతోపాటు అరెస్ట్ అయిన వారని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే కూర రాజన్న అరెస్ట్ విషయాన్ని వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement