రాజకీయ కక్షలతోనే కృష్ణారావు హత్య : సిఐ | Krishna Rao murder with political faction: CI Ramkumar | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్షలతోనే కృష్ణారావు హత్య : సిఐ

Aug 13 2014 7:57 PM | Updated on Sep 17 2018 4:56 PM

కృష్ణారావు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు(ఫైల్ ఫొటో) - Sakshi

కృష్ణారావు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు(ఫైల్ ఫొటో)

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో వైఎస్ఆర్సిపి నేత కృష్ణారావును ప్రత్యర్థులు రాజకీయ కక్షలతోనే హత్యచేశారని రూరల్ సిఐ రామ్‌కుమార్‌ చెప్పారు.

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో వైఎస్ఆర్సిపి నేత కృష్ణారావును ప్రత్యర్థులు రాజకీయకక్షలతోనే హత్య చేశారని రూరల్ సిఐ రామ్‌కుమార్‌ చెప్పారు.  టిడిపికి చెందిన కొందరు కిరాతకులు ఆదివారం అర్ధరాత్రి వేళ కృష్ణారావు ఇంట్లోకి చొరబడి  ఆటవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ  హత్యకేసులో నిందితులు ఆరుగురిని రూరల్‌ సీఐ రామ్‌కుమార్‌ ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కృష్ణారావు కుటుంబాన్ని ఈ ఉదయం పరామర్శించారు. తాము అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భోరోసా ఇచ్చారు. వారిని ఓదార్చి మనోధైర్యం నింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement