ఇరుప్రాంతాలకూ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఆ పార్టీ రైతు విభాగం గుంటూరు
ఉడుముల ఆమరణ దీక్ష భగ్నం
Aug 30 2013 4:09 AM | Updated on Aug 21 2018 5:44 PM
మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్ :ఇరుప్రాంతాలకూ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఆ పార్టీ రైతు విభాగం గుంటూరు, నెల్లూరు జిల్లాల కన్వీనర్ ఉడుముల కోటిరెడ్డి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట మూడు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్షను బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు భగ్నం చేసి స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై రాజమోహనరావులు తమ సిబ్బందితో వచ్చి దీక్ష విరమించాలని కోటిరెడ్డిని కోరారు.
అందుకు ఆయన నిరాకరించటంతో జీపులో వైద్యశాలకు తరలించి బలవంతంగా చికిత్స చేయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని పార్టీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి, వైపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజులు గురువారం ఉదయం పరామర్శించారు. నేతల వెంట పెద్దారవీడు మాజీ ఎంపీపీ దుగ్గెంపుడి వెంకటరెడ్డి, ఆరవీటి మౌలాలీ, పి.కాశిం, ఎస్‌కే ఖలీల్, డి.వెంకటరెడ్డి, రామిరెడ్డి, పాపిరెడ్డి సుబ్బారెడ్డి, గెల్లి చౌడేశ్వరరావు, టీవీ కాశయ్య, డాన్ శ్రీను, కాళ్ల ఆది, ఆర్.యలమంద, కందురు వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు.
లక్ష్మీరెడ్డి దీక్షను కూడా..
పెద్దారవీడు, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు మద్దతుగా మండలంలోని సానికవరానికి చెందిన ఒద్దుల లక్ష్మీరెడ్డి కూడా మూడో రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేస్తుండగా మార్కాపురం సీఐ శివరామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై రాములనాయక్‌లు తమ సిబ్బందితో బుధవారం అర్ధరాత్రి వచ్చి దీక్ష భగ్నం చేశారు. ఆస్పత్రికి వచ్చేది లేదంటూ లక్ష్మీరెడ్డి ప్రతిఘటించినా పోలీసులు పట్టించుకోకుండా ఆయన దీక్షను భగ్నం చేసి మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఆస్పత్రిలో అతికష్టం మీద సెలైన్ ఎక్కించారు. గురువారం ఉదయం డాక్టర్ ఐసీ లక్ష్మీరెడ్డి వచ్చి లక్ష్మీరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీరెడ్డిని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, తిమ్మిశెట్టి తిమ్మరాజు, పొందుగుల వెంకటరెడ్డి, ఇంజినీరింగ్ విద్యార్థులు ఒద్దుల నారాయణరెడ్డి, పొందుగుల సంజీవరెడ్డి, రామిరెడ్డి, వీరారెడ్డి, ప్రసన్న భరత్‌రెడ్డి, గుండారెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీనుయాదవ్, సురేశ్, మాధవ్‌లు పరామర్శించారు.
Advertisement
Advertisement