
అధిక ధర పలికిన కొమ్ము కోనాం చేప
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ మత్స్యకారులకు బుధవారం అతి భారీకొమ్ము కోనాం చేపలు లభ్యమయ్యాయి. ఫిషింగ్ హార్బర్‌లో బుధవారం సాయంత్రం సుమారు 20 వరకు కొమ్ము కోనాం చేపలను విక్రయించారు.
ఒక్కో కొమ్ము చేప 100 కేజీల నుంచి 800 కేజీల బరువు తూగాయి. వీటి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేలు పలికింది. ఇంత బరువున్న చేపలను నీటిలో నుంచి బయటకు తీసేందుకు జాలర్లు కష్టపడాల్సి వచ్చింది. వీటిని వేలం పాటలో పాడుకునేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు.