breaking news
konam
-
వైజాగ్ చేప.. ‘కోనాం’గలరా?
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ మత్స్యకారులకు బుధవారం అతి భారీకొమ్ము కోనాం చేపలు లభ్యమయ్యాయి. ఫిషింగ్ హార్బర్లో బుధవారం సాయంత్రం సుమారు 20 వరకు కొమ్ము కోనాం చేపలను విక్రయించారు. ఒక్కో కొమ్ము చేప 100 కేజీల నుంచి 800 కేజీల బరువు తూగాయి. వీటి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేలు పలికింది. ఇంత బరువున్న చేపలను నీటిలో నుంచి బయటకు తీసేందుకు జాలర్లు కష్టపడాల్సి వచ్చింది. వీటిని వేలం పాటలో పాడుకునేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. -
గుట్టలుగా కోనాం చేపలు
పాతపోస్టాఫీసు కోనాం, టూనా చేపలు మంగళవారం ఉదయం చేపలరేవుకు గుట్టలుగా చేరుకున్నాయి. రేవుకు చేరిన బోట్లలో అధికంగా కోనాం చేపలు వలకు చిక్కడంతో బోట్ల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రకం చేపలను అత్యధికంగా ఎగుమతి చేస్తారు. కోనాం, టూనా చేపలకు దేశీయంగా కూడా మంచి ధర పలుకుతుంది. స్టార్ హోటళ్లలో మాంసాహార ప్రియులకు వీటిని వండి వడ్డిస్తారు. కోనాం చేపల ధర కూడా అధికంగానే పలుకుతుంది. మంగళవారం వేలంలో పదిహేను కేజీలు ఉన్న చేప మూడువేల రూపాయల ధర పలికింది. వీటిని బెంగళూరు, చెన్నై, ఒడిస్సా, కోల్కత్తాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేశారు. గత ఏడాది కన్నా ప్రస్తుత సీజన్లో చేపల ధర బాగా పడిపోయిందని బోట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.