గుట్టలుగా కోనాం చేపలు | Konam fish | Sakshi
Sakshi News home page

గుట్టలుగా కోనాం చేపలు

Aug 30 2016 6:25 PM | Updated on Sep 4 2017 11:35 AM

గుట్టలుగా కోనాం చేపలు

గుట్టలుగా కోనాం చేపలు

కోనాం, టూనా చేపలు మంగళవారం ఉదయం చేపలరేవుకు గుట్టలుగా చేరుకున్నాయి. రేవుకు చేరిన బోట్లలో అధికంగా కోనాం చేపలు వలకు చిక్కడంతో బోట్ల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు.

పాతపోస్టాఫీసు
 కోనాం, టూనా చేపలు మంగళవారం ఉదయం చేపలరేవుకు గుట్టలుగా చేరుకున్నాయి. రేవుకు చేరిన బోట్లలో అధికంగా కోనాం చేపలు వలకు చిక్కడంతో బోట్ల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రకం చేపలను అత్యధికంగా ఎగుమతి చేస్తారు. కోనాం, టూనా చేపలకు దేశీయంగా కూడా మంచి ధర పలుకుతుంది. స్టార్‌ హోటళ్లలో మాంసాహార ప్రియులకు వీటిని వండి వడ్డిస్తారు. కోనాం చేపల ధర కూడా అధికంగానే పలుకుతుంది. మంగళవారం వేలంలో పదిహేను కేజీలు ఉన్న చేప మూడువేల రూపాయల ధర పలికింది. వీటిని బెంగళూరు, చెన్నై, ఒడిస్సా, కోల్‌కత్తాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేశారు. గత ఏడాది కన్నా ప్రస్తుత సీజన్‌లో చేపల ధర బాగా పడిపోయిందని బోట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement