
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు కియా సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో మరో 54 మిలియన్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ సంస్థ కూకున్ షిమ్ వెల్లడించారు. కియా ఎస్‌యూవీ వెహికల్స్ తయారీకి ఈ కొత్త పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కియాకు బలమైన బంధం ఉందని కూక్యూన్ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన ఎన్నో అనుకూలతలు ఏపీలో ఉన్నాయని విదేశీ పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలమైన వనరులు ఉన్నాయని.. జావాబుదారీ తనంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. (చదవండి : ఆ సత్తా విశాఖకు మాత్రమే ఉంది : సీఎం జగన్)