
ఆర్గినెన్స్ ను ఆమోదించవద్దని ప్రణబ్ కు కేసీఆర్ విజ్ఞప్తి
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ నేపథ్యంలో ముంపు గురయ్యే గ్రామాలను ఆంధ్రాలో కలిపివేయాలని జారీ చేయనున్న ఆర్డినెన్స్ మరోసారి తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ నేపథ్యంలో ముంపు గురయ్యే గ్రామాలను ఆంధ్రాలో కలిపివేయాలని జారీ చేయనున్న ఆర్డినెన్స్ మరోసారి తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేందుకు జారీ చేయనున్న ఆర్డినెన్స్ అప్రజాస్వామికమని, ఆ ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ముంపు గ్రామాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ గురువారం బంద్ కు పిలుపునిచ్చారు.