రాజధానిని విభజించే హక్కు సీఎంకు ఉంది: కంచ ఐలయ్య

Kancha Ilaiah Said CM Has The Right To Divide Capital - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడ ఉండాలనేది  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయమని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య తెలిపారు. రాజధానిని విభజించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు నష్టం లేకుండా చూడాలని కోరారు. రాజధాని కోసం సేకరించిన వేల ఎకరాలు ఇప్పటికీ ముట్టుకోకుండా ఉన్నాయని, మరో 20 ఏళ్లు అయిన చంద్రబాబు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేడని విమర్శించారు. 

భూములు కావాలన్న వారికి భూములు ఇవ్వాలని, రైతులకు ఇస్తానన్న పరిహారం 15 ఏళ్ల పాటు రూ. 50 వేల చొప్పున ఇ‍వ్వాలని సూచించారు. అదే విధంగా మత ప్రతిపాదికన పౌరసత్వాన్ని ఇవ్వడం సరైన పద్దతి కాదని.. నిరసనలు తెలుపుతున్న ముస్లింల వేషధారణ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రధానమంత్రి వేసుకున్న డ్రెస్‌ ముస్లిం వేషధారణ కాదా అని కంచ ఐలయ్య ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top