వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు | Kakinada to Secunderabad Special Train Between Rush Of Passengers | Sakshi
Sakshi News home page

వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

Aug 2 2019 2:28 AM | Updated on Aug 2 2019 5:02 AM

Kakinada to Secunderabad Special Train Between Rush Of Passengers - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జి పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌(07436) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 7, 14 తేదీలలో రాత్రి 6.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌– కాకినాడ టౌన్‌ (07001) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 8న రాత్రి 8.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. అలాగే సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌(07053) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 17న రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.35 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. 

ఇక కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌(07437) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 10న రాత్రి 9.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.55 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఇదే రైలు ఆగస్ట్‌ 17న రాత్రి 9.40గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు 7.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. అలాగే కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌(07002) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 9న రాత్రి 8.45 గంటలకు కాకినాడటౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ (07054) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 18న రాత్రి 8.40గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌–నాగర్‌సోల్‌(07064) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.55 గంటలకు నాగర్‌సోల్‌ చేరుతుంది. 

నాగర్‌సోల్‌–సికింద్రాబాద్‌(07063) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 11వ తేదీ రాత్రి 10 గంటలకు నాగర్‌సోల్‌లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌ చేరుతుంది. హైదరాబాద్‌–శ్రీకాకుళంరోడ్‌ (07026) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 5, 7 తేదీలలో రాత్రి 7.30కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.10 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. శ్రీకాకుళంరోడ్‌–హైదరాబాద్‌(07025) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 6, 8 తేదీలలో సాయంత్రం 5.15గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.20గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది. జబల్‌పూర్‌–తిరునల్వేలి(02194) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 1, 8, 15, 22, 29, సెప్టెంబర్‌ 5, 12, 19, 26వ తేదీలలో ఉదయం 9.30 గంటలకు జబల్‌పూర్‌లో బయలుదేరి రెండవరోజు తెల్లవారుజామున 4.45 గంటలకు తిరునల్వేలి చేరుతుంది. తిరునల్వేలి–జబల్‌పూర్‌(02193) ప్రత్యేక రైలు ఆగస్ట్‌ 3, 10, 17, 24, 31, సెప్టెంబర్‌ 7, 14, 21, 28 సాయంత్రం 5.45 గంటలకు తిరునల్వేలిలో బయలుదేరి రెండవ రోజు ఉదయం 11.15గంటలకు జబల్‌పూర్‌ చేరుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement