క్షమాపణ కోరిన కాకతీయ గ్రూప్ చైర్మన్ | Kakatiya Group Chairman Apology to Students Parents | Sakshi
Sakshi News home page

క్షమాపణ కోరిన కాకతీయ గ్రూప్ చైర్మన్

Jul 24 2014 7:39 PM | Updated on Sep 2 2017 10:49 AM

మెదక్ జిల్లాలో తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారామిరెడ్డి ఎట్టకేలకు స్పందించారు.

హైదరాబాద్: మెదక్ జిల్లాలో తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారామిరెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఘటనలో తమ తప్పులేదని సాక్షితో అన్నారు. రైల్వే తప్పిదమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు.

స్కూల్ బస్సు పూర్తి కండీషన్‌లో ఉందని, స్కూల్‌ను నిబంధనల ప్రకారమే నడుపుతున్నామని చెప్పారు. అన్నీ స్కూళ్లకు పర్మిషన్లు ఉన్నాయని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థులు తన పిల్లలు లాంటివారని గద్గర స్వరంతో అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను క్షమాపణ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement