అరగంట వ్యవధిలో తండ్రీకొడుకు మృతి..

Father And Son Died Within Half An Hour Due To Illness - Sakshi

కుటుంబంలో విషాదం

సాక్షి, తూప్రాన్‌: అనారోగ్యంతో గత కొంత కాలంగా బాధపడుతున్న తండ్రి, కుమారుడు అరగంట వ్యవధిలో మృతిచెందిన సంఘటన తూప్రాన్‌ మున్సిసల్‌ పరిధిలోని పడాల్‌పల్లి గ్రాంమలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పడాల్‌పల్లి గ్రామాలనికి చెందిన కాసుకుంట యాదగిరి(60) గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటూ చిక్సిత్స పొందుతన్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతి చెందాడు. తన కుమారుడు కృష్ణ(37) కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో భాదపడుతున్నాడు.

తూప్రాన్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మృతిచెందిన విషయం ఆప్పటికి కుమారునికి తెలియదు. అరగంట వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

చదవండి: శ్మశానాల్లో దుస్తులు దొంగిలించి.. మార్కెట్‌లో అమ్మకం..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top