దక్షిణాఫ్రికాలో కానూరు వాసి హత్య | Kaanuru dude killed in South Africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాలో కానూరు వాసి హత్య

Dec 30 2013 12:50 AM | Updated on Jul 30 2018 8:27 PM

దక్షిణాఫ్రికాలో కానూరు వాసి హత్య - Sakshi

దక్షిణాఫ్రికాలో కానూరు వాసి హత్య

కానూరుకు చెందిన యువ ఇంజినీర్ దక్షిణాఫ్రికాలో ఈనెల 23 వేకువజామున హత్యకు గురయ్యా డు. అతని మృతదేహాన్ని ఆదివారం కానూరులోని ఇంటికి తీసుకువచ్చారు.

=శరీరంపై తీవ్ర గాయాలు
 =వారానికి కానూరు చేరిన మృతదేహం
 =మృతుడు ఇంజినీర్


పెనమలూరు, న్యూస్‌లైన్ : కానూరుకు చెందిన యువ ఇంజినీర్ దక్షిణాఫ్రికాలో ఈనెల 23 వేకువజామున  హత్యకు గురయ్యా డు. అతని మృతదేహాన్ని ఆదివారం కానూరులోని ఇంటికి తీసుకువచ్చారు. వివరాలిలా ఉన్నాయి. ఉయ్యూరు మండలం కడవకొల్లు పంచాయతీ పొట్లపాడుకు చెందిన పోలవరపు రా మారావు కుటుంబం కానూరు మహదేవపురం కాలనీ రోడ్డులో ఉంటోంది. ఆయన కుమారుడు సురేష్(30) విజయవాడలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాడు.

దక్షిణాఫ్రికాలోని ట్యుటోరియాలో ఆరేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. అప్పుడప్పుడు కానూరు వచ్చి వెళుతుండేవాడు. ఈనెల 22వ తేదీ రాత్రి సురేష్ తండ్రి రామారావు, తల్లి పద్మలతో ఫోన్‌లో చాలసేపు మాట్లాడాడు. మరుసటి రో జు వేకువజామున సురేష్ ఇంటి ఎదుట లాన్‌లో తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్న ట్లు అక్కడ ఉన్న అతడి మిత్రులు కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా స మాచారం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ దేశంలోని భారతీయుల సహకారంతో మృతదేహాన్ని వారం రోజులకు ఆది వారం విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తరలిం చారు. అక్కడి నుంచి కానూరులోని నివాసానికి తీసుకువచ్చారు.
 
కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు

 కాగా సురేష్ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీ రు మున్నీరుగా విలపించారు. సురేష్ ఉన్నత స్థితికి చేరుకుంటాడని ఆశించానమి, వచ్చే ఏడాది పెళ్లి చేద్దామని అనుకున్నామని, ఈలోపు ఈ ఘటన జరిగిందని తెలిపారు. సురేష్ ఎలా చనిపోయాడనే విషయమై కుటుంబ సభ్యులకు వివరాలు తెలియలేదు. దుండగులు అతడిని హత్య చేసి ఉం టారని భావిస్తున్నారు. విజయవాడ శ్మశానవాటికలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement