జై మోదకొండమ్మ  | Jy Modakondamma Cinema Shooting In Paderu | Sakshi
Sakshi News home page

జై మోదకొండమ్మ 

Apr 19 2018 9:30 AM | Updated on Aug 11 2018 8:29 PM

Jy Modakondamma Cinema Shooting In Paderu - Sakshi

జై మోదకొండమ్మ సినిమాలో ఓ సన్నివేశం 

పాడేరు రూరల్‌ : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, మన్యం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ తల్లి చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న జై మోదకొండమ్మ సినిమా షూటింగ్‌ పాడేరు మండలంలోని పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. బుధవారం డల్లాపల్లి, అమ్మవారి పాదాలు తదితర చోట్ల హీరోయిన్, ఇతర నటీనటులపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. పాడేరు, చింతపల్లి, మాడుగుల ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుతున్నామని చిత్ర యూనిట్‌ తెలిపింది. రెండు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేస్తామన్నారు. సీనియర్‌ నటుడు సత్యప్రకాష్, శివకృష్ణ, కృష్ణవేణిలతోపాటు మిస్‌ కర్ణాటక ఐశ్వర్య, పి.శ్యామ్‌ సుందర్, మాస్టర్‌ కౌశిక్, మాస్టర్‌ వినయ్, గొల్లపూడి గౌరీశంకర్, లక్ష్మి, పాడేరుకు చెందిన డాక్టర్‌ శివాజీరాజు, సరోజలు నటిస్తున్నారు. పోలాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement