'ఏ సమాచారమైనా తెలుసుకునే అధికారం ఉంది' | Justice R Kantarao Condemned False Propaganda | Sakshi
Sakshi News home page

'ఏ సమాచారమైనా తెలుసుకునే అధికారం ఉంది'

Jun 3 2020 1:55 PM | Updated on Jun 3 2020 1:55 PM

Justice R Kantarao Condemned False Propaganda - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికిగాను పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు ఏపీలోని ఏ విద్యాసంస్థల సమాచారం అయినా తీసుకునే అధికారం ఉందని కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ ఆర్.కాంతారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కమిషన్‌పై కొంత మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు సమాంతరంగా అమలవుతాయి.

ఆంగ్ల విద్యపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఆంగ్ల విద్య కావాలని అభిప్రాయపడ్డారు. అన్ని విద్యాసంస్థలకు ఒకే ఆర్థిక పరిస్థితి ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగానే విద్యా విధానాన్ని మార్చడానికి సీఎం జగన్‌ విశేష కృషిచేస్తున్నారు. నాణ్యమైన విద్య అందించాలన్నదే మా లక్ష్యం' అంటూ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు వెల్లడించారు.  

చదవండి: 'సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని వర్గాల అభిమాని' 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement