25న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష | jee advanced exam on 25th may | Sakshi
Sakshi News home page

25న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

May 6 2014 2:12 AM | Updated on Sep 2 2017 6:58 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఈనెల 25న నిర్వహించనున్నట్లు నిర్వాహక సంస్థలు ప్రకటించాయి.

సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఈనెల 25న నిర్వహించనున్నట్లు నిర్వాహక సంస్థలు ప్రకటించాయి. ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) అవకాశం కల్పించాయి. ఈసారి పరీక్షను ముంబై, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాసు, రూర్కీ ఐఐటీలు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈనెల 25న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాయి. ఐఐటీలో చేరాలంటే జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. జేఈఈ-మెయిన్ పరీక్షలో తొలి 1,50,000లోపు ర్యాంకు వారే జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులు.

 

ఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో కేటగిరీ వారీగా అభ్యర్థులు సాధించిన జాతీయస్థాయి ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. అయితే వీరంతా ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన 12వ తరగతిలో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement