జననేత పాదయాత్ర పుస్తకావిష్కరణ | Jananetha Padayatra Book Released | Sakshi
Sakshi News home page

జననేత పాదయాత్ర పుస్తకావిష్కరణ

Jan 19 2020 10:20 AM | Updated on Jan 19 2020 10:20 AM

Jananetha Padayatra Book Released - Sakshi

పాదయాత్ర పుస్తకాన్ని విడుదల చేస్తున్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జననేత పాదయాత్రపై గొల్లల మామిడాడకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి రాసిన పాదయాత్ర పుస్తకాన్ని శనివారం ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు క్యాంపు కార్యాలయం విడుదల చేశారు. కాఫీ టేబుల్‌ బుక్‌ తరహాలో ఈ పుస్తకాన్ని ముద్రించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రస్తావనతో మొదలైన ఈ పుస్తకంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర, రాజ్యాధికారం చేపట్టడం, నవరత్నాలు అమలు తదితర అంశాలపై సాగింది. ప్రత్యేక కథనాలతో కూడిన ఛాయాచిత్రాలు ఆకట్టుకున్నాయి. 150 పేజీల ఈ పుస్తకాన్ని వినాయక పబ్లికేషన్స్‌ ప్రచురించింది. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు భీమవాదం భరత్‌రెడ్డి, సిద్ధారెడ్డి, ప్రముఖ మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement