ఏపీ సీఎస్గా ఐవైఆర్, డీజీపీగా జెవి రాముడు! | Ivr krishna rao may by appoint andhra pradesh chief secretary | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎస్గా ఐవైఆర్, డీజీపీగా జెవి రాముడు!

May 24 2014 12:47 PM | Updated on Sep 2 2017 7:48 AM

ఏపీ సీఎస్గా ఐవైఆర్, డీజీపీగా జెవి రాముడు!

ఏపీ సీఎస్గా ఐవైఆర్, డీజీపీగా జెవి రాముడు!

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నియామకాలు, రాజధాని నిర్మాణం, ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలపై బాబు ఈ సందర్భంగా గవర్నర్తో చర్చించినట్లు సమాచారం. కాగా చంద్రబాబుతో పాటు  ఐఏఎస్ అధికారి, తిరుమల మాజీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు కూడా గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు అధికారుల నియామకంపై కసరత్తు చేస్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించే యోచనలో బాబు ఉన్నట్లు సమాచారం. అలాగే డీజీపీగా జాస్తి వెంకట రాముడు (జెవి రాముడు), హోంశాఖ  ముఖ్య కార్యదర్శిగా ప్రస్తుత డీజీపీ ప్రసాదరావు, చంద్రబాబు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా అజయ్ సహానీ, సీఎంఓ కార్యదర్శులుగా గిరిధర్, సాయిప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement