ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కాకుంటే ఆ ప్రాంతంలో ఆందోళనలు ఎగసి పడే అవకాశాలు ఉన్నాయని హోంశాఖ మంత్రి షిండేకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కాకుంటే ఆ ప్రాంతంలో ఆందోళనలు ఎగసి పడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో హోం మంత్రి షిండేను కలిశారు.
అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయనకు సూచించినట్లు జానారెడ్డి చెప్పారు. గతంలో తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న తీర్మానం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని షిండేకు విన్నవించినట్లు జానారెడ్డి చెప్పారు.