వైద్యుల నియామకాల్లో అక్రమాలు | Irregularities in Doctor posts selections | Sakshi
Sakshi News home page

వైద్యుల నియామకాల్లో అక్రమాలు

Dec 3 2013 5:02 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో వైద్యుల నియామకానికి సంబంధించి విడుదల చేసిన మెరిట్ జాబితాలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో వైద్యుల నియామకానికి సంబంధించి విడుదల చేసిన మెరిట్ జాబితాలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ పోస్టుకు ఎంపికైన వారి పూర్తి వివరాలను వెల్లడించకుండా, కేవలం హాల్‌టికెట్ నెంబర్‌ను మాత్రమే ఆన్‌లైన్‌లో పెట్టడంపై వారు సోమవారం సంబంధిత అధికారులను నిలదీసి, డీహెచ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాగా, ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ అనంతరం తుది జాబితాను విడుదల చేస్తామని  వైద్య ఆరోగ్యశాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా ఉండగా, వైద్యుల నియామకాలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పీకే మహంతి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వైవీ అనురాధను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement