
గ్రామాన్ని దత్తత తీసుకున్న మరో ఐపీఎస్ అధికారి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని తోపుగుంట గ్రామాన్ని ఐపీఎస్ అధికారి ఈతముక్కల దామోదర్(ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్) ఆదివారం దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలు దత్తత తీసుకున్నవారి జాబితాలో మరో ఐపీఎస్ అధికారి చేరారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని తోపుగుంట గ్రామాన్ని ఐపీఎస్ అధికారి ఈతముక్కల దామోదర్(ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్) ఆదివారం దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.
ఆయన స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణతో కలసి గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ సహాయంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.కాగా ఏపీ డీజీపీ జెవి రాముడు తన స్వగ్రామం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నర్సింహాపల్లి గ్రామాన్ని ఫిబ్రవరిలో దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.