బాలికల హాస్టల్‌లో విచారణ | investigation in girls hostel on messiness | Sakshi
Sakshi News home page

బాలికల హాస్టల్‌లో విచారణ

Feb 6 2014 5:08 AM | Updated on Sep 15 2018 3:07 PM

మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో జరిగిన అవకతవకలపై బుధవారం ‘సాక్షి’ టాబ్లాయిడ్‌లో ప్రచురించిన ‘హాస్టల్‌లో.. అర్ధాకలి’తో వార్తకు అధికారులు స్పందించారు

ఎల్లారెడ్డి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో జరిగిన అవకతవకలపై బుధవారం ‘సాక్షి’ టాబ్లాయిడ్‌లో ప్రచురించిన ‘హాస్టల్‌లో.. అర్ధాకలి’తో వార్తకు అధికారులు స్పందించారు. మ ద్నూర్ ఏఎస్‌డబ్ల్యూఓ వెంకట్‌రాములును బుధవారం విచారణ నిమిత్తమై ఎల్లారెడ్డికి పంపించారు.

ఆయన హాస్టల్ విద్యార్థులందరితో మాట్లాడి, వివరాలను సేకరించారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యా ర్థి నాయకులు విద్యాసాగర్,అరుణ్,మహేశ్ వినతిపత్రం అందచేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement