
అంతర్‌రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
ఇళ్లు, దుకాణాల ఎదుట పార్కింగ్ చేసిన మోటార్‌సైకిళ్లను చాకచక్యంగా అపహరించే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. శనివారం తన కార్యాలయం లో ఏర్పాటు
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : ఇళ్లు, దుకాణాల ఎదుట పార్కింగ్ చేసిన మోటార్‌సైకిళ్లను చాకచక్యంగా అపహరించే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. శనివారం తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రభాకర్‌రావు నిందితుల వివరాలు వెల్లడించారు. గుర్రంపోడు మం డలం కోయగూరోని బావి గ్రామానికి చెందిన షేక్ మహమూద్, షేక్ తాజుద్దీన్, మహబూబ్‌నగర్ జిల్లా చలకుర్తికి చెందిన షేక్ కదీర్‌లు స్నేహితులు. వీరు తాగుడు, జల్సాల కు అలవాటుపడి దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ కమిషనరేట్ ప్రాంతాల్లో మొత్తంగా 55 బైకులను దొంగలించి కోయగూరోని బావి గ్రామంలోని ఓ బత్తాయి తోటలో ఉంచారు.
వీటిని ఒక్కొక్కటిగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొనుగోలు దారులు కాగితాలు గురించి అడిగితే ఫైనాన్స్‌లో ఉన్నాయని, ఇంకా క్లియర్ కాలేదని చెబుతు కాలయాపన చేసుకుంటూ వచ్చారు. శుక్రవారం గుర్రంపోడులో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించగా బైకుల గుట్టు రట్టయింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 55 బైకుల విలువ రూ.25 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రమారాజేశ్వరి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.