సమర్థంగా ఇంటర్ ప్రాక్టికల్స్ | Inter effective practical | Sakshi
Sakshi News home page

సమర్థంగా ఇంటర్ ప్రాక్టికల్స్

Feb 10 2014 1:21 AM | Updated on Sep 2 2017 3:31 AM

సమర్థంగా ఇంటర్ ప్రాక్టికల్స్

సమర్థంగా ఇంటర్ ప్రాక్టికల్స్

ఈ నెల 12 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.వెంకట్రామయ్య అన్నారు.

జిల్లాలో 175 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
 నాలుగు విభాగాలుగా నిర్వహణ
 ఆర్‌ఐఓ కె.వెంకట్రామయ్య వెల్లడి

 
విజయవాడ, న్యూస్‌లైన్ : ఈ నెల 12 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.వెంకట్రామయ్య అన్నారు. పరీక్షలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ నిర్వహణపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో మహాత్మాగాంధీ రోడ్డులోని మాంటిస్సోరి మహిళా కళాశాలలో ఆదివారం సమావేశం నిర్వహించారు.

ఆర్‌ఐఓ వెంకట్రామయ్య మాట్లాడుతూ ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జిల్లా వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లాలో 48 వేల 913 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 34 వేల 584 మంది కాగా, బైపీసీ విద్యార్థులు 11 వేల 695 మంది, ఒకేషనల్ అభ్యర్థులు 2,634 మంది ఉన్నట్లు వివరించారు.

మొదటి స్పెల్‌లో ఈ నెల 12 నుంచి 16 వరకు, రెండో స్పెల్‌లో 17 నుంచి 22 వరకు, మూడో స్పెల్‌లో 23 నుంచి 28 వరకు, నాలుగో స్పెల్‌లో 29 నుంచి మార్చి 4 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల సందర్భంగా ప్రతి కళాశాలా విధిగా లేబరేటరీలలో పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని, వారు నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు.
 
థియరీ పరీక్షలకూ ఏర్పాట్లు పూర్తి...
 
ప్రాక్టికల్ పరీక్షల అనంతరం మార్చి 12 నుంచి థియరీ పరీక్షలు జరుగుతాయని ఆర్‌ఐఓ చెప్పారు. వాటికి కూడా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే థియరీ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ఎంపిక చేశామని, త్వరలో వాటికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు సాల్మన్‌రాజు, ప్రసాదరావులతో పాటు పలు కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement