ముంబయిలో ఫొటో జర్నలిస్టుపై లైంగిక దాడి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
లైంగికదాడి ఘటనపై వినూత్న నిరసన
Aug 29 2013 3:41 AM | Updated on Sep 1 2017 10:12 PM
మంచిర్యాల టౌన్/శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : ముంబయిలో ఫొటో జర్నలిస్టుపై లైంగిక దాడి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో నిర్భయ ఘటన మొదలుకుని ఇప్పటివరకు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కళ్లుండి గుడ్డిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో అత్యాచర ఘటనలు జరుగుతన్నా నిర్భయ కేసులు నమోదైన దాఖలాలు లేవని అన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు కుర్ర అంజి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెర్క మహేందర్, మండల నాయకులు సెగ్యం నరేశ్, కౌటం శ్రీనివాస్, రవికుమార్, రాజు, టీబీఎస్‌ఎఫ్ నాయకులు మధూకర్, పల్లి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా కమిటీ పిలుపు మేరకు బుధవారం సీసీసీ కార్నర్ వద్ద ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ముంబయి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సీహెచ్.లింగమూర్తి, ఏఐవైఎఫ్ మండల డెప్యూటీ కార్యదర్శి సిరికొండ నరేశ్, నాయకులు రావుల పవన్, పల్లె శ్రీనివాస్, రాగిడి రాజు, సారంగపాణి, కౌటం శ్రీనువాస్, జగన్, సుధన్ పాల్గొన్నారు.
మందమర్రిలో..
మందమర్రి రూరల్ : ఫొటో జర్నలిస్టుపై లైంగిక దాడికి నిరసనగా బుధవారం రామకృష్ణాపూర్ ఆర్కే1 కోల్‌బెల్ట్ ప్రధాన రహదారిపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు నక్క వెంకటస్వామి మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇటీవల మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి అన్నం శ్రీనివాస్, గుమ్మడి మల్లేశ్, రామడుగు లక్ష్మణ్, మహంకాళి శ్రీనివాస్, ఎం.పౌల్, ఎం.గోపి, ఎల్పుల శ్రీనివాస్, మేకల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement