మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఇన్నోవా | innova Straight into medical shop in guntur district due to driver unhealthy | Sakshi
Sakshi News home page

మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఇన్నోవా

Mar 26 2016 4:06 PM | Updated on Oct 9 2018 7:52 PM

వేగంగా వెళ్తున్న ఇన్నోవా బైక్‌ను ఢీకొనడంతో పాటు మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

గుంటూరు: వేగంగా వెళ్తున్న ఇన్నోవా బైక్‌ను ఢీకొనడంతో పాటు మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో శనివారం జరిగింది.

పొన్నూరు నుంచి గుంటూరు వెళ్తున్న ఇన్నోవా డ్రైవర్కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో.. స్థానిక దారా ఇమాం పంజా మసీదు సమీపంలోని మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న షేక్ నబిపాషా, పర్విన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇన్నోవా డ్రైవర్కు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement