
నారాయణవనం: సీతారామ చరిత్రను తెలిపే రామాయణం తపాలా బిళ్లలను భారత తపాలా శాఖ దీపావళి సందర్భంగా విడుదల చేసిందని స్థానిక ఉప తపాలా కార్యాలయ అధికారి ఓబుల్‌రెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీరామ చరిత్రను ప్రతిబింబించే రీతిలో 11 తపాలా బిళ్లలతో కూడిన పోస్టర్‌ను రూ.65కు మండలంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో పొందవచ్చన్నారు. అరుదైన పౌరాణిక చిత్రాలను దాచుకోవచ్చని అన్నారు. ఈ బిళ్లలను శుభ సందర్భాల్లో ఆత్మీయులు, సన్నిహితులకు పంపే తపాలా కవర్లపై అంటించి పంపుకోవచ్చనని చెప్పారు.