శ్రీనివాస్‌ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు | Income Tax Raids Continue On Chandrababu Former PS Srinivas In Vijayawada | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Feb 8 2020 10:36 AM | Updated on Feb 8 2020 10:44 AM

Income Tax Raids Continue On Chandrababu Former PS Srinivas In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ ఇంట్లో మూడో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత 48 గంటలుగా నిర్విరామంగా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. శ్రీనివాస్‌కు చెందిన వాల్ లాకర్ నుంచి భూ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంకు లాకర్ నుంచి నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్‌ దంపతుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ఐటీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు(శనివారం) సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక్కడ చదవండి: చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు
చదవండి: ఐటీ వలలో కమీషన్ల ‘బాస్‌’!
చదవండి: బాలకృష్ణ చిన్నల్లుడి కుటుంబానికి మరో షాక్‌

Advertisement
 
Advertisement
Advertisement