పట్టుకున్నారు.. వదిలేశారు! | Illegal Sand Mining TDP leader | Sakshi
Sakshi News home page

పట్టుకున్నారు.. వదిలేశారు!

Mar 24 2016 11:26 PM | Updated on Aug 10 2018 9:42 PM

మండలంలోని కొప్పెర్ల సమీపంలో చంపావతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన...

 పూసపాటిరేగ :  మండలంలోని కొప్పెర్ల సమీపంలో చంపావతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన పలు ట్రాక్టర్లను అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వదిలేశారు. ఈ ట్రాక్టర్లను నాలుగురోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, దీనిపై అధికారపార్టీ ఒత్తిళ్లు తీవ్రస్థాయికి చేరినట్లు భోగట్టా. రాష్ట్రస్థాయి అధికారుల వరకూ విషయం వెళ్లింది. దీంతో కలెక్టర్, ఎస్పీ చర్చించిన తర్వాత ఇసుక ట్రాక్టర్లను విడిచిపెట్టేశారని సమాచారం.
 
 నివేదికలో మార్పులు?
 పట్టుబడిన ట్రాక్టర్లకు సంబంధించి తొలుత స్థానిక అధికారులు నివేదికలను ఒకలా ఇచ్చినట్లు తెలిసింది. వంతెనలు, తాగునీటి బావులకు 500 మీటర్ల దూరంలో తవ్వాల్సి ఉందని, ఆ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతుండగా సదరు ట్రాక్టర్లను పట్టుకున్నామని తొలుత ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు సమాచారం. పై నుంచి ఒత్లిళ్లు రావడంతో అ తర్వాత నివేదికలో మార్పులు చేసినట్లు భోగట్టా. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి తుది నివేదిక పంపించాలని తహశీల్దార్ జయదేవికి ఆదేశాలు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement