
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న ఇసుక అక్రమ మైనింగ్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) శనివారం విచారణ జరిపింది. ఈ కేసులో కేంద్ర పర్యావరణ శాఖ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు నెలల కిందట నోటీసు ఇచ్చినా.. ఇప్పటివరకు స్పందించకపోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణశాఖ తీరు మారకపోతే.. అధికారులు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ రోజే కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.