breaking news
Central Environment Ministry
-
ఏపీలో అక్రమ మైనింగ్: కేంద్రంపై ఎన్జీటీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న ఇసుక అక్రమ మైనింగ్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) శనివారం విచారణ జరిపింది. ఈ కేసులో కేంద్ర పర్యావరణ శాఖ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు నెలల కిందట నోటీసు ఇచ్చినా.. ఇప్పటివరకు స్పందించకపోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణశాఖ తీరు మారకపోతే.. అధికారులు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ రోజే కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. -
వ్యర్థం.. అనర్థం
ఒక ప్లాస్టిక్ బాటిల్ నలిపి పారేస్తాం.. ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడి పారేస్తాం..కానీ మనం అనుకుంటున్న ఆ ఒక్క ప్లాస్టిక్ బాటిల్.. ఆ ఒక్క ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్.. ఒకట్లు పదులవుతున్నాయి.. వందలు వేలవుతున్నాయి.. లక్షలు కోట్లవుతున్నాయి.. అటు వాటిని రీసైక్లింగ్ చేసే యూనిట్ల పరిస్థితీ అంతంత మాత్రంగా ఉండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉభయ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. సాక్షి, అమరావతి: గత నాలుగైదేళ్లలో తెలంగాణ, ఏపీలో ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల పెరిగిపోతోంది. దీంతో వేలాది మంది జబ్బుల బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ప్లాస్టిక్ చెత్త విడుదల్లో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ వ్యర్థాన్ని నిర్వీర్యం లేదా రీసైక్లింగ్ చేసేందుకు తగిన వ్యవస్థలు లేకపోవడం, నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం పర్యావరణానికి ముప్పుగా మారింది. గతంలో ప్లాస్టిక్ వాడొద్దు.. పేపర్ బ్యాగ్లు వాడాలని ప్రచారం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. నియంత్రణకు చర్యలేవీ? 2011లో 1.40 లక్షల టన్నులున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు 2.43 లక్షల టన్నులకు చేరాయి. చెత్త సేకరణ చేసి సకాలం లో నిర్వీర్యం చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో వివిధ ఆస్పత్రుల నుంచి వెలువడే బయోమెట్రిక్ వ్యర్థాల నిర్వీర్యం కూడా సరిగా జరగడం లేదని తేలింది. అమలుకాని నిబంధనలు.. ప్లాస్టిక్ వినియోగంపై నిబంధనలు అమలు కావడంలేదు. 50 మైక్రాన్ల బ్యాగుల కంటే తక్కువ మందం ఉన్న బ్యాగుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2016లో నిబంధనలు విధించింది. ఆస్పత్రుల్లో విడుదలవుతున్న బయో వ్యర్థాలపైన కూడా ఆంక్షలు విధించింది. ఎక్కడైతే బయో వ్యర్థాలు విడుదలవుతున్నాయో వాటి నిర్వీర్యంలో కూడా ఆ సంస్థలే ప్రధానంగా బాధ్యత వహించాలని సూచించారు. కానీ ఈ నిబంధనలు తెలుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే భయానక జబ్బులు - ఆడవాళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ(సంతానోత్పత్తి)కు విఘాతం.. వ్యాధి నిరోధకత భారీగా తగ్గుతుంది - కేన్సర్ వ్యాధికారకాలు పెరిగి వ్యాధి బారిన పడే అవకాశం - సెక్స్ హార్మోన్లు క్రమంగా తగ్గుతాయి - గుండె జబ్బులు రావడానికి కూడా దోహదం కేరళను చూసి నేర్చుకోవాల్సిందే ప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తి, వాటి నిర్వీర్యం,రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి వాటిలో దేశంలోనే కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. కేరళలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి 50 వేల టన్నులు వీటిని నిర్వీర్యం,రీసైక్లింగ్ చేయడానికి ఉన్న యూనిట్లు 807 2.43(లక్షల టన్నులు) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యేటా విడుదలవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 67 రెండు రాష్ట్రాల్లో కలిపి రీసైక్లింగ్ యూనిట్లు.వీటిలో కొన్ని పనిచేయడంలేదు -
మితిమీరిన జంతుప్రేమ
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుండగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పశువుల క్రయవిక్రయాలపై హఠాత్తుగా జారీ చేసిన నోటిఫికేషన్ అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. మొత్తంగా పశు వధ నిషేధం అమల్లోకి తీసుకొచ్చారన్న విమర్శలు రాకుండా, క్రయవిక్రయాలకు విఘాతం కలిగించారన్న నిందపడకుండా ఈ నోటిఫికేషన్ కర్తలు చాలా జాగ్రత్తలు పాటించారు గానీ... దీన్ని జారీ చేసే ముందు కనీసం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని, వాటి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని ఎందుకనిపించలేదో ఆశ్చర్యకరం. కనీసం పశువుల సంతలతో ముడిపడి ఉండే గ్రామీణ సంస్కృతి గురించి, ఆ సంతలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది గురించి ఈ నోటిఫికేషన్ కర్తలు కాస్తయినా ఆలోచించారా అన్న అనుమానం కలుగుతుంది. దేశంలో పశువుల సంతలు వేలాది సంవత్సరా లుగా జరుగుతున్నాయి. సమాజంలోని కొన్ని కులాలు కేవలం ఆ క్రయ విక్రయా లపై ఆధారపడే జీవనం సాగిస్తున్నాయి. తమ నోటిఫికేషన్ వల్ల ఇదంతా గంద రగోళంలో పడుతుందని, లక్షలాదిమంది జీవనాధారం దెబ్బతింటుందని పర్యావ రణ మంత్రిత్వ శాఖ గ్రహించకపోవడం విచారకరం. పాడిపంటలు దేశ సౌభాగ్యానికి రెండు కళ్లు. పాలకుల విధానాల పుణ్యమా అని ఈ రెండూ గత కొన్నేళ్లుగా దెబ్బతింటూ వస్తున్నాయి. రైతులు నానాటికీ అప్పుల్లో కూరుకుపోతున్నారు. కరువుకాటకాల వల్ల అటు పశుగ్రాసానికి కూడా తీవ్ర కొరత ఏర్పడటంతో రైతులు తమ దగ్గరున్న మూగజీవాలను ఎలా పోషిం చాలో అర్ధంకాక కబేళాలకు తరలిస్తున్నారు. సాగును, పశుగణాన్ని బతికించడానికి అవసరమైన కార్యాచరణపై దృష్టి పెట్టాల్సిన ఈ తరుణంలో ఉన్నట్టుండి పర్యావ రణ శాఖ ఈ నోటిఫికేషన్ ఎలా జారీచేసిందో... పశు సంవర్ధక శాఖ చూసుకోవా ల్సిన ఈ వ్యవహారంలోకి ఎందుకు చొరబడిందో అనూహ్యం. ఈ నోటిఫికేషన్ 1960నాటి జంతు హింసా నివారణ చట్టంకింద జారీ చేశారు. దీన్ననుసరించి ఆవులు, దూడలు, గేదెలు, ఎద్దులు, ఒంటెలు అమ్మేవారు ఇకపై వ్యవసాయ అవసరాల కోసమే వాటిని అమ్ముతున్నామని, కబేళాల కోసం కాదని లిఖితపూర్వక ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. తమకు సంబంధించిన సమస్త వివరాలూ ఫొటోలతోసహా ఇవ్వాలి. జిరాక్స్ కాపీలు జత చేయాలి. అటు కొను క్కునేవారు సైతం తాము కొంటున్నది వ్యవసాయ అవసరాలకు మాత్రమేనని ధ్రువీకరించాలి. హామీ పత్రాలివ్వాలి. వీరిద్దరూ వ్యవసాయం కోసమే ఈ లావాదేవీ జరిపారు తప్ప కబేళా కోసం కాదని సంత నిర్వాహణ కమిటీలు కూడా ధ్రువీ కరించాల్సి ఉంటుంది. ఈ ధ్రువీకరణ కాపీలు అయిదు తయారుచేసి రెవెన్యూ అధికారికి, పశు వైద్యాధికారికి, పశువుల మార్కెట్ కమిటీకి సమర్పించాలి. క్రయ విక్రయదారులిద్దరూ చెరో కాపీ ఉంచుకోవాలి. ఇంతేకాదు... పశువుల మార్కెట్ కమిటీలు మూడు నెలల్లోపు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే పశు మార్కెట్ పర్యవేక్షణ కమిటీలో రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నిబంధనలు ఉన్న కొద్దీ పెరుగుతూ పోవన్న నమ్మకమేమీ లేదు. రైతులు పశువుల్ని తీరి కూర్చుని అమ్ముకోరు. సాకినన్నాళ్లూ వాటిని తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా చూసుకోవడం వారి సంస్కృతి. వ్యవసాయానికి అవసరమైన డబ్బు కోసమో, ఇంట్లో అత్య వసరంగా వచ్చిపడిన ఇబ్బంది తీర్చుకోవడానికో రైతులు పశువుల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. కరువు విలయతాండవం చేస్తూ పశుదాణా లభ్యం కానప్పుడు, ప్రభు త్వాలు సైతం అందుగురించి పట్టించుకోనప్పుడు విధిలేని స్థితిలో అమ్ముకుంటారు. పశువులు తీవ్ర అనారోగ్యానికి లోనైనప్పుడో, నిరుపయోగంగా మారినప్పుడో పోషించలేక తప్పనిసరై విక్రయిస్తారు. ఒక బర్రెకు దాణా కోసం రోజుకు రూ. 125 నుంచి రూ. 150 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాలు కనీస ధర రూ. 40 వరకూ ఉంటుంది. పాల ఉత్పత్తి సరిగా లేకపోతే ఎన్నాళ్లని ఆ బర్రెను రైతు పోషిం చగలుగుతాడు? బాగా పాలిచ్చే వాటిని పెంచడం, అలా లేనివాటిని తొలగించు కోవడమనే ప్రక్రియ వల్లనే పాడి పరిశ్రమ బతకగలుగుతోంది. ఈ కొత్త నిబంధ నలు దాన్నంతటినీ తలకిందులు చేస్తాయి. పశువుల వర్తకులైనా, కొనుగోలుదారుౖ లెనా అధికశాతం నిరుపేదలు. నిరక్షరాస్యులు. ఇప్పుడు వచ్చిపడిన నిబంధనల కారణంగా ఇలాంటివారంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. అక్కడ సహజంగా చోటుచేసుకునే జాప్యం వల్ల అతి త్వరలోనే లంచావతారాలు పుట్టుకొచ్చి ఆ రైతుల్ని, వ్యాపారుల్ని పీల్చి పిప్పి చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు. అసలు పశువుల అమ్మకం మొత్తాన్ని నియంత్రించాలన్న ఆలోచన ఎందుకు వచ్చినట్టు? పాడి, వ్యవసాయ అవసరాలతోపాటు కబేళాలకు తరలించడానికి కూడా ఈ మార్కెట్లలో పశువుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్న అనుమానా లున్నాయట. జంతు హింసను నివారించడానికే దీన్ని జారీచేశారట. ఈ నోటి ఫికేషన్ పరోక్షంగా పశు మాంసం భుజించడాన్ని నిషేధిస్తోంది. శాకాహారానికి పరి మితం కావాలని శాసిస్తోంది. కబేళాలన్నిటికీ తాళం వేయాలని చూస్తోంది. అయితే వాటన్నిటినీ నేరుగా చెప్పలేక యాతన పడుతోంది. మన దేశం నుంచి 2016–17లో రూ. 26,000 కోట్ల విలువైన పశు మాంసం ఎగుమతులు జరిగాయి. తోలు పరి శ్రమ ఉత్పత్తుల విలువ రూ. 35,000 కోట్లు. వీటిపై ఆధారపడి లక్షలాదిమంది జీవిస్తున్నారు. జంతు మాంసం, దాని అనుబంధ ఉత్పత్తులకు అవసరమయ్యే పశువుల్లో 90 శాతం పశువుల సంతల నుంచే సరఫరా అవుతాయి. వాటిపై ఆధారపడేవారిలో ముస్లింలు అధికం. ఇప్పటికే దేశంలో పలుచోట్ల గో సంరక్షణ పేరిట కొన్ని బృందాలు ఏర్పడి పశువుల్ని తరలించే ట్రక్కుల్ని ఆపి డ్రైవర్లపైనా, ఇతరులపైనా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని మరింత పెంచడం, లక్షలాదిమంది జీవితాలను అయోమయంలోకి నెట్టడం తప్ప ఈ నోటిఫికేషన్ సాధించేదేమీ ఉండదు.