అనైతిక చర్యలు.. ఆపై బెదిరింపులు | ikp employee raju asks police for security | Sakshi
Sakshi News home page

అనైతిక చర్యలు.. ఆపై బెదిరింపులు

Dec 11 2013 5:01 AM | Updated on Sep 2 2017 1:27 AM

వ్యక్తిగత జీవితంలో అనైతిక చర్యలకు పాల్పడి ఉద్యోగం నుంచి ఉద్వాసన పొందిన ఐకేపీ ఓ మాజీ ఉద్యోగి.. ఆ శాఖ ఉద్యోగులనూ వదలడం లేదు.

 సంగెం, న్యూస్‌లైన్ : వ్యక్తిగత జీవితంలో అనైతిక చర్యలకు పాల్పడి ఉద్యోగం నుంచి ఉద్వాసన పొందిన ఐకేపీ ఓ  మాజీ ఉద్యోగి.. ఆ శాఖ ఉద్యోగులనూ వదలడం లేదు. తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాల ని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిస్తున్నాడు. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది అతడి నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రరుుంచారు. ఈ మేరకు జిల్లా జెండర్ డీపీఎం బి.గీతారాణి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో వివరాలు వెల్లడించారు. మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన వేల్పుల రాజు గతంలో ఐకేపీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహించేవాడు. రాజుకు భార్య ఉండగా మరో మహిళతో వివాహేతర సం బంధం సాగించాడు.

దీంతో తనకు అన్యాయం చేస్తున్నాడని, భర్తపై చర్య తీసుకోవాలని కోరుతూ అతడి భార్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. జిల్లా కుటుంబ ఉచిత న్యాయ సలహా కేంద్రానికి రాజును, అతడి భార్య ను, వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళను పిలిపించి కౌన్సెలింగ్ కూడా  ఇప్పించారు. కలెక్టర్ నుంచి డీఆర్‌డీఏ పీడీకి అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి రాజు ప్రవర్తన సరిగా లేనందున జిల్లా సమాఖ్య ఆదేశా ల మేరకు ఉద్యోగం నుంచి తొలగించారు.

రాజు ఈ నెల 3, 9వ తేదీల్లో సంగెం శాంతి మండల సమాఖ్య కార్యాలయానికి వచ్చి ఏపీఎం ఝా న్సీ, ఇతర ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తూ  ఉద్యోగంలోకి తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని, అతడిపై చర్య తీసుకోవాలని కోరుతూ సంగెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డీపీఎం పేర్కొన్నారు. రాజు నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. సమావేశంలో డీపీఎం వెంట ఏపీఎం ఝాన్సీ, మండల సమాఖ్య కోశాధికారి పసునూరి సరోజన, జిల్లా సోషల్ యూక్టివిటీ కమిటీ సభ్యులు వై.మణెమ్మ, బి.ప్రమీల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement