విగ్రహాలను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు | idioms thieves arrested in nellore district | Sakshi
Sakshi News home page

విగ్రహాలను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు

Jan 13 2016 3:29 PM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విగ్రహాలను దొంగిలిస్తున్న ఓ ముఠాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: నెల్లూరు జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విగ్రహాలను దొంగిలిస్తున్న ఓ ముఠాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పండితి వెంకటేశ్, చిలుకూరి శ్యాంకుమార్, రామస్వామి సుబ్రమణ్యం అనే వ్యక్తులు ముఠాగా ఏర్పాడి గత కొంతకాలంగా ఆలయాల్లోని పురాతన విగ్రహాలను ఎత్తుకెళ్తున్నారు. దీనిపై పలు ఫిర్యాదుల అందడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి స్టైల్లో విచారణ చేపట్టడంతో నిందితులు దొంగతనాలను అంగీకరించారు. వారి నుంచి అతి విలువైన బుద్ధ విగ్రహంతో పాటు దేవతా విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement