బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు | icds officers stopped child marriage | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Mar 12 2015 3:13 PM | Updated on Sep 19 2018 8:32 PM

విజయనగరంలో బాల్య వివాహాన్ని అధికారులు గురువారం అడ్డుకున్నారు.

విజయనగరం :జిల్లాలోని ఓ బాల్య వివాహాన్ని అధికారులు గురువారం అడ్డుకున్నారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గొలుగువలస గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు శుక్రవారం వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిశ్చయించారు. అయితే ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు విషయాన్ని ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు.

 

వెంటనే బాలిక తల్లిదండ్రులను కలిసిన ఐసీడీఎస్ అధికారులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో వివాహాన్ని ఆపేందుకు వారు సమ్మతించారు.

Advertisement
 
Advertisement
Advertisement