20 మంది ఐఏఎస్‌ల బదిలీ | IAS officers get transfers in AP | Sakshi
Sakshi News home page

20 మంది ఐఏఎస్‌ల బదిలీ

Apr 18 2017 3:53 AM | Updated on Jun 2 2018 2:56 PM

రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

- ఏడుగురికి స్థాన చలనం.. చిత్తూరు కలెక్టర్‌గా ప్రద్యుమ్న

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లుగా పని చేస్తున్న వారిలో ఆరుగురిని వివిధ శాఖల్లో నియమించగా కేవలం కోన శశిధర్‌ను మాత్రమే మరో జిల్లాకు కలెక్టర్‌గా నియమించారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రద్యుమ్నను ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు కలెక్టర్‌గా నియమించారు. గతంలో ఆయన ఆ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా ఉన్న ధనుంజయ్‌రెడ్డిని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement