
రాబోయే ఎన్నికల అనంతరం రెడ్ లైట్ పెట్టుకొని టెంపుల్ రావాలని కోరుతున్నా. అధికారుల కన్నా వాలంటీర్ల సేవలే అమోఘం, అమ్మవారు వారినే..
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి! ప్రాణాలు అడిగినా ఇచ్చేంత భక్తుడినని సినీనటుడు పృధ్వీరాజ్ అన్నారు. గురువారం ఆయన విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చిన్నప్పటి నుంచి అమ్మవారిని కొలుస్తున్నానని అన్నారు. అమ్మకొండపై అధికారుల అత్యుత్సాహం తగదని, రాజను, భటుడును ఒకేలా చూడాలని సూచించారు. అధికార పార్టీల నేతల సిఫార్సులు ఉంటేనే గౌరవిస్తారా అంటూ ప్రశ్నించారు.
వైసీపీ వస్తే అధికారుల దౌర్జన్యాలు ఉండవని అన్నారు. ‘రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి జగనే. రాబోయే ఎన్నికల అనంతరం రెడ్ లైట్ పెట్టుకొని టెంపుల్ రావాలని కోరుతున్నా. అధికారుల కన్నా వాలంటీర్ల సేవలే అమోఘం, అమ్మవారు వారినే దీవిస్తుంది.’