అసెంబ్లీని రద్దు చేయాలని సీఎంకు చెప్పా: టీజీ | I urged chief minister to dissolve assembly, says TG Venkatesh | Sakshi
Sakshi News home page

అసెంబ్లీని రద్దు చేయాలని సీఎంకు చెప్పా: టీజీ

Nov 21 2013 3:53 PM | Updated on Jul 29 2019 5:31 PM

అసెంబ్లీని రద్దు చేయాలని సీఎంకు చెప్పా: టీజీ - Sakshi

అసెంబ్లీని రద్దు చేయాలని సీఎంకు చెప్పా: టీజీ

అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు.

హైదరాబాద్ : అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. అసెంబ్లీ రద్దు అయితే విభజన బిల్లుపై చర్చ ఉండదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని న్యాయ నిపుణులతోపాటు, ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్లు టీజీ తెలిపారు. 

రాష్ట్రానికి వచ్చే ముసాయిదా బిల్లులో రాయల తెలంగాణపై అభిప్రాయం కోరే అంశం ఉంటుందని ..... దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మున్సిపల్ కార్పొరేటర్లు, సర్పంచ్లతో చర్చలు జరుపుతామన్నారు. ఆ తర్వాతే అంతిమ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. విభజన జరిగితే కొత్తపార్టీకి అవకాశం ఉండదని టీజీ పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవోల ఛలో ఢిల్లీకి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement