కిరణ్ వెంటే ఉంటా.. | i am went to kiran kumar reddy-veera sivareddy | Sakshi
Sakshi News home page

కిరణ్ వెంటే ఉంటా..

Feb 25 2014 3:53 AM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్ వెంటే ఉంటా.. - Sakshi

కిరణ్ వెంటే ఉంటా..

కిరణ్ కుమార్ రెడ్డి వెంటే తాను ఉంటానని ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ సీమాంధ్రకు ద్రోహం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవన్నారు.

 కిరణ్ కుమార్ రెడ్డి వెంటే తాను ఉంటానని ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ సీమాంధ్రకు ద్రోహం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవన్నారు.

 

 మలాపురం, : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి వెంటే తాను ఉంటానని కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి స్పష్టం చేశారు.  తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  కిరణ్ కొత్త పార్టీ పెట్టి కొత్త రక్తాన్ని  తీసుకువస్తారని ఆయన అన్నారు. బీజేపీకి రాష్ట్రంలో పట్టులేని కారణంగా విభజనకు మద్దతు తెలిపిందని ఆయన మండిపడ్డారు. 

 

తప్పుడు నిర్ణయాలతోనే రాష్ట్ర విభజన చేశారని,  త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు.  కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాదని ఆయన అన్నారు. టీబిల్లుకు  సవరణలు చేసి ఆమోదించి ఉంటే విభజన వేరే విధంగా ఉండేదన్నారు.  ప్రస్తుతం జరిగిన విభజనతో సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయిందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement