బిక్కవోలులో భారీ చోరీ | huge theft in bikkavolu | Sakshi
Sakshi News home page

బిక్కవోలులో భారీ చోరీ

Apr 23 2015 12:57 PM | Updated on Sep 3 2017 12:45 AM

పెళ్లికి వెళ్లి వచ్చే సరికి ఇంటిని గుళ్ల చేసిన సంఘటన రాజమండ్రి పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

రాజమండ్రి: పెళ్లికి వెళ్లి వచ్చే సరికి ఇంటిని గుల్ల చేసిన సంఘటన రాజమండ్రి పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం పొంకుదురు గ్రామానికి చెందిన పి.వీర్రాఘవులు కుటుంబం బంధువుల పెళ్లికి వెళ్లడంతో ఇదే అదునుగా దొంగలు తెగబడ్డారు. ఇంట్లో ఉన్న 50 తులాల బంగారం రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం పెళ్లి నుంచి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవింద్రనాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement