కల్వకుర్తి కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం | Huge fire accident in vegetable market in kalwakurthy | Sakshi
Sakshi News home page

కల్వకుర్తి కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం

Dec 25 2013 8:19 AM | Updated on Sep 5 2018 9:45 PM

మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలోని కూరగాయల మార్కెట్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలోని కూరగాయల మార్కెట్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అగ్నికీలలు అదుపులోకి తీసుకువచ్చారు.

 

ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు 45 దుకాణాలకు పైగా అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ. 25 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ప్రమాదం చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement