ప్రమాదానికి బాధ్యతారాహిత్యమే కారణం: బాబు | HPCL company irresponsible - Chandrababu Fires on fire accident | Sakshi
Sakshi News home page

ప్రమాదానికి బాధ్యతారాహిత్యమే కారణం: బాబు

Aug 24 2013 6:50 PM | Updated on Jul 28 2018 3:21 PM

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి కంపెనీ అధికారులు బాధ్యతారాహిత్యమే కారణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు.

విశాఖ : విశాఖ హెచ్‌పీసీఎల్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి కంపెనీ అధికారులు బాధ్యతారాహిత్యమే కారణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శనివారం ప్రమాద ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని మండిపడ్డారు.

ఈ సంఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందినవారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోం ఇవ్వాలన్నారు. కాగా హెచ్‌పీసీఎల్‌లో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement