జానకిరామ్కు కారు ప్రమాదం జరిగింది ఇలా ... | How did Nandamuri Janakiram car accident | Sakshi
Sakshi News home page

జానకిరామ్కు కారు ప్రమాదం జరిగింది ఇలా ...

Dec 7 2014 3:10 AM | Updated on Sep 28 2018 3:39 PM

జానకిరామ్కు కారు ప్రమాదం జరిగింది ఇలా ... - Sakshi

జానకిరామ్కు కారు ప్రమాదం జరిగింది ఇలా ...

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షడు ఎన్టీఆర్ కుమారుడు టీడీపీ సీనియర్ నాయకుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకీరామ్ శనివారం ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు.

హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షడు ఎన్టీఆర్ కుమారుడు టీడీపీ సీనియర్ నాయకుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ శనివారం ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో హరికృష్ణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

కారు ప్రమాదం జరిగింది ఇలా ...
*హైదరాబాద్ నుంచి విజయవాడ నందమూరి జానకిరామ్ టాటా సఫారీ కారు వెళ్తున్నారు.
*నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద వరినారుతో ట్రాక్టర్ రాంగ్ రూట్లో వస్తుంది.
*అధిక వేగంతో వెళ్తున్న జానకీరామ్ కారు... ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించ బోయారు... ఆ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న   కారు మూడు రౌండ్లు గుండ్రంగా తిరిగి.... దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న గుంతలో పడింది.
*ఈ ప్రమాదంలో జానకిరామ్ తలకు, వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయి.
*ఆ రహదారిపై వస్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... జానకిరామ్ను కోదాడలోని ఆస్పత్రికి తరలించారు.  
*మార్గమధ్యంలోనే జానకిరామ్ మరణించారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
*ప్రయాణ సమయంలో జానకిరామ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement