వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు | Hostels, getting checks | Sakshi
Sakshi News home page

వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు

Jul 11 2014 12:13 AM | Updated on Aug 17 2018 12:56 PM

వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు - Sakshi

వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు

స్థానిక రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో జిల్లా ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

 ఫిరంగిపురం : స్థానిక రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో జిల్లా ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు మూడు బృందాలుగా ఏర్పడి రాత్రి 6.30 గంటల వరకు  23 రకాల రిజిస్టర్‌లను పరిశీలించారు.తనిఖీలలో సీఐలు శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, యాదగిరి, సత్తెనపల్లి  సాంఘిక సంక్షేమశాఖ ఏఎస్‌డబ్లు అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు.
 
 రెంటచింతలలో...
 ఎస్సీ బాలికల హాస్టల్‌లో గురువారం ఏసీబీ డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆకస్మిక తనిఖీ నిర్విహ ంచారు. అకౌంట్స్ ఆఫీసర్ రామిరెడ్డి, ఏసీబీ సీఐ కె.సీతారామ్, సత్తెనపల్లి తూనికలు, కొలతల ఇన్‌స్పెక్టర్ ఎన్.అల్లూరయ్య, 15 మంది బృంద సభ్యులు తనిఖీలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement