హోంగార్డులకు ఇళ్ల స్థలాలు | homeguards to Home places | Sakshi
Sakshi News home page

హోంగార్డులకు ఇళ్ల స్థలాలు

Sep 9 2014 1:14 AM | Updated on Apr 8 2019 8:33 PM

హోంగార్డులకు ఇళ్ల స్థలాలు - Sakshi

హోంగార్డులకు ఇళ్ల స్థలాలు

జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి కృషి చేస్తున్నారని హోంగార్డుల డీఎస్పీ (తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు) ఎస్‌ఎస్‌కేవీ కృష్ణారావు తెలిపారు.

ఎస్పీ రఘురామ్‌రెడ్డి కృషి చేస్తున్నారని హోంగార్డుల డీఎస్పీ ఎస్‌ఎస్‌కేవీ కృష్ణారావు వెల్లడి
భీమవరం అర్బన్ : జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి కృషి చేస్తున్నారని హోంగార్డుల డీఎస్పీ (తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు) ఎస్‌ఎస్‌కేవీ కృష్ణారావు తెలిపారు. చాలామంది హోంగార్డులకు ఉండేందుకు సొంత ఇళ్లు లేవని, వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎస్పీ ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు. స్థానిక లూథరన్ హైస్కూల్ క్రీడామైదానంలో సోమవారం నరసాపురం డివిజన్‌లోని హోంగార్డులకు డ్రిల్ నిర్వహించి పలు సూచనలు చేశారు.

శాంతి భద్రతలను కాపాడటంలో, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో, ప్రభుత్వరంగ ఆస్తుల పరిరక్షణలో హోంగార్డులు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడవద్దని, డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని వారికి సూచించారు. ఓఎన్‌జీసీ, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో మరింతమంది హోంగార్డులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హోంగార్డ్స్ ఏఆర్ ఎస్సై ఎ.హనుమంతరావు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement