ఉండి ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

High Tension At Undi MRO Office - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ఉండి ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌ సీపీ అభిమానులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేయటంతో పరిస్థితులు అదుపతప్పాయి. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం వైఎస్సార్‌ సీపీ, టీడీపీ కార్యకర్తలు అభ్యర్థుల వెంట నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనటానికి ఉండి ఎమ్మార్వో ఆఫీసు వద్దకు ఒకేసారి చేరుకున్నారు. దీంతో ఒకరికొకరు ఎదురుపడి పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇరువర్గాలను చెల్లా చెదురు చేయటానికి పోలీసులు లాఠీ చార్జ్‌ చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థి వెంట ఎక్కువ మంది రాకూడదంటూ వైఎస్సార్‌ సీపీ అభిమానులపై, కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేయటం గమనార్హం.

గోపాలపురం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
గోపాలపురం : గోపాలపురం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సైతం ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నామినేషన్‌ వేస్తుండగా టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ గదిలోపలికి దూసుకురావటం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయటానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు, టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు కార్యకర్తలతో కలిసి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ వేస్తుండగా టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వర రావు గదిలోపలికి దూసుకు వచ్చారు. అయినప్పటికి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కరుణ కుమారి పక్షపాత వైఖరితో పట్టించుకోలేదు. అంతకు ముందు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేస్తుండడంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి కరుణ కుమారి నిలిపివేశారు. అయితే టీడీపీ అభ్యర్థి వైఖరిపై రిటర్నింగ్ అధికారి స్పందించకపోవటం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top