తక్షణ విక్రయం కోసం అక్షయగోల్డ్ ఆస్తులు, వాటి విలువ తదితర వివరాలన్నింటినీ సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం ఏపీ సీఐడీ అధికారులను
అక్షయగోల్డ్ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తక్షణ విక్రయం కోసం అక్షయగోల్డ్ ఆస్తులు, వాటి విలువ తదితర వివరాలన్నింటినీ సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం ఏపీ సీఐడీ అధికారులను, పిటిషనర్లను ఆదేశించింది. అగ్రిగోల్డ్ తరహాలోనే ఈ ఆస్తుల విక్రయానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వారుుదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తమ నుంచి దాదాపు 600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి వాటిని చెల్లించకుండా అక్షయగోల్డ్ ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే.