'గుప్త నిధుల'తవ్వకాలు - పది మంది అరెస్ట్


గుప్త నిధుల కోసం తవ్వకాలకు ప్రయత్నించిన పది మందిని అనంతపురం జిల్లా పెనుకొండ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో టీడీపీ మాజీ నాయకుడు వేపకుంట రాజన్న, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పట్టణంలోని బసవన్న బావి వద్ద వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top